RS Praveen Kumar | ఆసిఫాబాద్ : అకాల వడగండ్ల వాన వల్ల వరి పండించే రైతులు భారీగా నష్టపోయారని తెలిసి సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలంలోని పలు గ్రామాల్లో రైతులను కసినట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రైతులను కలిసి మాట్లాడుతుంటే వారి బాధ వర్ణనాతీతం అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల బాధలు వినే నాథుడే లేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే నన్ను కోసినా రూపాయి లేదని తెలివిగా చేతులెత్తేసిండు. బీజేపీ పార్టీ రైతులకు అందనంత దూరంలో దాక్కుంది. ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కనీసం ఎమ్మెల్యే రైతులను పలకరించే పరిస్థితి లేదు. రైతులంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండేదని బాధపడుతున్నారు. తిరిగి తెలంగాణను కాపాడుకుంటమని శపథం చేస్తున్నారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
అకాల వడగండ్ల వాన వల్ల వరి పండించే రైతులు భారీగా నష్టపోయారని తెలిసి సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలంలోని పలు గ్రామాల్లో రైతులను కలిసాను.
వారి బాధ వర్ణనాతీతం.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల బాధలు వినే నాధుడే లేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే నన్ను కోసినా రూపాయి లేదని తెలివిగా… pic.twitter.com/RFlo2B7ZYh
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 8, 2025