RS Praveen Kumar | అచ్చంపేట : బీఆర్ఎస్ పార్టీని వీడిన గువ్వల బాలరాజుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2007 నుండి మీతోనే ఉన్నాను సార్ దయచేసి పార్టీ వీడొద్దని గువ్వల బాలరాజును ఒక కార్యకర్త వేడుకున్నా ఆయన గుండె కరగలేదు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆర్ఎస్పీ ప్రసంగించారు.
కానీ ఒక్క ఓటమితో కుంగిపోతే ఎలా..? బాలరాజు. ఒక కార్యకర్త అయితే రెండు చేతులు జోడించి 2007 నుంచి మీతోనే ఉన్నాను. మీరు వెళ్లకండి బీఆర్ఎస్ గెలవబోతుందంటే ఆయన గుండె కగరలేదు. ఇవాళ ఆయన బీజేపీలో చేరుతుండు. ఎంపీ అభ్యర్థిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, విప్‌గా అవకాశం ఇచ్చారు కేసీఆర్. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. పార్టీని ప్రాణానికి కన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు ఉన్నాక ఏ విధంగా మనసు చంపుకొని బీజేపీలోకి పోతున్నరు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని. ఇంత మంది గొప్ప మనసు ఉన్న కార్యకర్తల పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి పోడానికి మీకు మనసు ఎలా వచ్చింది. నిరంతరం తెలంగాణను దోచుకోవడానికి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో కేసీఆర్ వైపు ఉండాల్నా..? బీజేపీ వైపు ఉండాల్నా..? ఇవాళ గువ్వల బాలరాజు అస్త్రసన్యాసం చేసి పోయారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు.
2007 నుండి మీతోనే ఉన్నాను సార్ దయచేసి పార్టీ వీడొద్దని గువ్వల బాలరాజును ఒక కార్యకర్త వేడుకున్నా ఆయన గుండె కరగలేదు
ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని
ఇంత మంది గొప్ప మనసు ఉన్న కార్యకర్తల పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి పోడానికి మీకు మనసు ఎలా వచ్చింది – బీఆర్ఎస్ నాయకుడు… pic.twitter.com/BhLvSXBN0e
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2025