RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసుల తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2025 జనవరి 28న ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రావాల్సిన వేలాది కోట్ల రూపాయాల ఆదాయానికి గండి పడిందని నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కానీ ఇంత వరకు సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కనీసం పోలీసులు ఫిర్యాదుదారునైన తనను విచారించకుండానే కేసు క్లోజ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
సీఎం లేదా హోంమంత్రి మీద కేసు పెట్టకూడదని బీఎన్ఎస్ఎస్ చట్టంలో ఎక్కడైనా ఉందా? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఉల్టా.. చేయని నేరానికి, ఫార్ములా వ్యవహారంలో ఒక తుఫైల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేటీఆర్కు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? సీఎంకు ఒక రూల్.. సామాన్యులకు మరో రూలా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.