RS Praveen Kumar | హైదరాబాద్ : ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రగ్భలాలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. గురుకుల ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారు..? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
ఇవాళ ఏప్రిల్ 9. నేటికి అన్ని సంక్షేమ గురుకులాల్లో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని ఉద్యోగులు హాహాకారాలు చేస్తున్నారు. వాళ్లకు డీఏ అరియర్లు రాలేదు..! వాళ్ల కుటుంబాలు ఎట్ల బతకాలి..? ప్రభుత్వ సంక్షేమ కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత రెండు నెలలుగా వేతనాలు అందలేదు. ఇట్లయితే పిల్లల భవిష్యత్ ఎట్ల బాగుపడుతది? ఒకటో తారీఖున జీతం వేస్తానన్న మాట ఎక్కడ పోయింది.. రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.