RS Praveen Kumar | హైదరాబాద్ : విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుతున్న పేద బిడ్డలకు స్కాలర్షిప్లు మంజూరు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మంది నిరుపేద పిల్లలను విదేశాలకు పంపి చదివించిందని ఆర్ఎస్పీ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్‌లో విద్యను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో ఈ ఘటనే ఉదాహరణ అంటూ ఆర్ఎస్పీ ఓ నిరుపేద తండ్రి రాసిన లేఖను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
నమస్కారం సార్..
‘సార్ మా యొక్క పిల్లలు (లావణ్య, హారిక, ప్రశాంత్) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుటకు వెళ్ళినారు. మా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగు లేకున్నా సొసైటీ పూర్తి బాధ్యత తీసుకుని ప్రతి సెమిస్టర్‌కు 6000 డాలర్లు ఇస్తానని హామీ ఇచ్చి పిల్లల్ని యూఎస్‌కు పంపించారు. గత మూడు సెమిస్టర్లకు రోనాల్డ్ రాస్, నవీన్ నికొలస్ గార్లు సరైన టైమ్‌కి పిల్లల కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు సొసైటీ ద్వారా విడుదల చేశారు. 4వ, 5వ సెమిస్టర్లకు ఫీజు చెల్లించాల్సి ఉంది. మేము పిల్లల యొక్క తల్లిదండ్రులుగా గత ఆరు నెలల నుంచి సెక్రెటరీ సొసైటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. కానీ ఎవరు కూడా సరిగ్గా స్పందించడం లేదు. ప్రస్తుతం పిల్లలు యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఎన్నోసార్లు సెక్రెటరీకి ఫోన్ చేస్తే తను మా యొక్కసొసైటీ అకౌంట్ డబ్బులు ఇమ్మంటారా? మీ పిల్లలతో మాకు ఏమి సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే విషయమై పలుసార్లు ప్రిన్సిపల్ సెక్రెటరీని కూడా కలిసాము. విషయం మొత్తం వివరించాము. తను కూడా ఏమీ చేయలేనట్టు అలాగే ఉన్నారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎలక్షన్ టైం అని లేదంటే ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది అని మాట దాటేస్తున్నారు. దయచేసి మా యొక్క పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా పిల్లల పరీక్ష ఫీజులు అందించాలని మేము ప్రాధేయ పడుతున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతుకలకు ఈ పేద బిడ్డల గోస కనిపించదా..? మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలే విదేశాల్లో చదవాల్నా..? మా పేద పిల్లలు చదవొద్దా?? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రేసు ప్రజాపాలన ఎంత హృదయవిదారకంగా ఉందో తెలుసుకోవాలంటే ఒక తండ్రి కన్నీటితో వ్రాసిన ఈ లెటర్ చదవాల్సిందే. వీళ్లు ప్రజావాణిలో కూడా ధరఖాస్తు చేసుకున్నరు. ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు రారు. తెలంగాణకు సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రే…
“నమస్కారం…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 21, 2024