హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయొద్దని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ గ్యారంటీల్లో భాగం గా రాష్ట్రంలో నేడు లక్షలాదిమంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారి ఆశలు అడియాసలు కాకుండా కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ జాబ్ క్యాలెండర్లో తేదీలతో సహా ప్రకటించిన విషయం విదితమే.