హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైడ్రా చర్యల వల్ల ముంపు తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంగా మాట్లాడారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం)తోనే హైదరాబాద్ సురక్షితంగా ఉన్నదని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా తీసుకున్న చర్యలతోనే హైదరాబాద్‌లో ముంపు తగ్గిందని గుర్తుచేశారు.
గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ లేఖ ద్వారా తెలిసిందని, అయినా వాటిని ఖమ్మం వరదల సందర్భంగా వాడుకోని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌దని దుయ్యబట్టారు. జేసీబీ డ్రైవర్ సుభాన్‌ఖాన్ సాహసం వల్ల బాధితుల ప్రాణాలు నిలబడ్డాయి తప్ప రేవంత్ సరార్ వల్ల కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రా తో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 2020లో హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేసినప్పుడే కేటీఆర్‌కు నాలాల విస్తరణ ఆలోచన రాగా నవంబర్లోనే ఎస్ఎన్డీపీ జీవో తెచ్చి మొదటి విడతలో రూ.980 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. ఆ పనులతోనే హైదరాబాద్ ముంపు బారినుంచి బయటపడిందని చెప్పారు.
రాష్ట్ర నిధులతోనే కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిషారం చూపిందని తెలిపారు. 14 ప్రాంతాలు,175 కాలనీల్లోని నాలుగు లక్షల కుటుంబాలకు వరద ముంపు తప్పిందని చెప్పారు. సీఎం రేవంత్‌కు ఎస్ఎన్డీపీ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో మళ్లీ కరెంటు, నీటి కష్టాలు తప్పడం లేదని, 9 నెలల పాలనలో హైదరాబాద్‌కు కొత్తగా దకిందేమీ లేదని ఎద్దేవాచేశారు.