Telangana | తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత చికిత్సపొందుతూ మృతి.. కంటతడి పెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
Telangana | తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత కృష్ణారెడ్డి మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.
Telangana | సూర్యాపేట : తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ ( BRS ) నేత కృష్ణారెడ్డి (Krishna Reddy ) మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagadish reddy )తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఉద్యమకారుడు పగడాల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ( Treatment ) ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, తదితరులు ఆదివారం కృష్ణారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని చూసి మంత్రి కంటతడి పెట్టుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సహచర ఉద్యమకారుడు పగడాల కృష్ణారెడ్డి అకాల మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

