హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సౌత్ ఫెస్ట్‌కు చెందిన జర్నలిస్టు సుమిత్ ఝా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలిపారు. ఆదివారం సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూవేలానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అనుకూలంగా రిపోర్టు చేసిన మీడియా ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు పెరిగాయని మండిపడ్డారు. అరెస్టు చేసిన జర్నలిస్టును వెంటనే విడుదల చేయాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.