హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. ‘అతడు ఉగ్రవాది కాదు.. నేరగాడు అసలే కాదు.. హైడ్రా బుల్డోజర్, మూసీ బాధితుల ఆక్రందనలు, కన్నీటి వేదనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిని జైల్లో వేశారని విమర్శించారు. అతడి ఫొటోను కాంగ్రెస్ ఐటీ సెల్‌కు పోలీస్ విభాగం ఎలా పంపిందని ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇది ఆ వ్యక్తి హకుల ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. దీనిపై హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతడి ఫొటోతోపాటు ‘హద్దు మీరితే తప్పదు శిక్షలు. ప్రశ్నించేతత్వాన్ని దు ర్వినియోగం చేస్తున్న పోరంబోకులు’ అని కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టు చేయడాన్ని క్రిశాంక్ ఖండించారు.