KTR : కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. బండి సంజయ్‌కి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాపాడాలనే తాపత్రయం దేనికో అని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా.. లేకపోతే బీజేపీ అనుబంధ ప్రభుత్వమా..? అనే సందేహం వ్యక్తంచేశారు.
”బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కుర్చీ కాపాడడానికి పడే తాపత్రయం ఏందో ?? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా ?? Ajab Prem Ki Ghajab Kahani” అని కేటీఆర్ పోస్టు చేశారు. దీనికి రేవంత్‌రెడ్డి సీఎం పదవి నుంచి దించేందుకు మంత్రులు కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించిన వార్తకు సంబంధించిన క్లిప్పింగ్‌ను జతచేశారు.
బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కుర్చీ కాపాడడానికి పడే తాపత్రయం ఏందో ??
ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా ??
Ajab Prem Ki Ghajab Kahani pic.twitter.com/3VBhxxUIoC
— KTR (@KTRBRS) October 19, 2024
సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు కుట్ర పన్నుతున్నారని శుక్రవారం బండి సంజయ్ విమర్శించారు. రేవంత్‌పై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరగాలని మంత్రులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రుల తీరు చూస్తుంటే సీఎంను త్వరలోనే గద్దె దించేస్తారని అనిపిస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.