Telangana Assembly Elections | దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొంది, గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావును ప్రభాకర్ రెడ్డి చిత్తుగా ఓడించారు. తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్లారు.