Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. చనాకా కొరాటా బ్యారేజి శుద్ధికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్టు చేయడంపై జోగు రామన్న తీవ్రంగా మండిపడ్డారు.
ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం ఎందుకు చేశారని జోగు రామన్న ప్రశ్నించారు. పాపాల భైరవుడు తిరిగిన చోటే నీరు రైతులకు అందది అనడానికి వీళ్లే నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. దీన్ని ప్రభుత్వ కుట్రగా అభివర్ణించారు.