రాహుల్జీ.. రేవంత్ వికృత పాలనపై మౌనమేల?
‘తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికృత పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫిరాయింపుల విషయంలో మీరు చెప్పిన నీతిసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
- కాంగ్రెస్ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతుంటే పట్టించుకోరా?
- రాహుల్‌గాంధీకి బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బహిరంగలేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికృత పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫిరాయింపుల విషయంలో మీరు చెప్పిన నీతిసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బుల్డోజర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మీరు తెలంగాణలో మీ పార్టీ ప్రభుత్వం హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ అరాచకానికి దిగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అంటూ హరీశ్‌రావు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాహుల్‌కు బహిరంగలేఖ రాశారు. రేవంత్ అరాచక పాలనపై ప్రజల నుంచి నిరసనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
లేఖలోని అంశాలు..
- మీరు రాజ్యాంగ విలువల గురించి దేశమంతా తిరిగి మాట్లాడుతుంటే, రేవంత్‌రెడ్డి అనాలోచిత, అవగాహన రాహిత్యంతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.
- ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే అటోమెటిక్‌గా డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం చేస్తామని మీరు ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టును సైతం అవమానించేలా అసెంబ్లీలో, బయట సభల్లో రేవంత్ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా తప్పుబట్టింది.
- దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్‌ను వ్యతిరేకిస్తున్న మీరు తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ పాలనపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక్కడ హైడ్రా, మూసీ ముసుగులో బుల్డోజర్లు పంపి పేద, మధ్యతరగతి ఇండ్లను కూలగొడుతుంటే కనిపించడంలేదా?
- ముఖ్యమంత్రి విధ్వంసపూరిత వైఖరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరి వందల ఎకరాల్లో విధ్వంసానికి తెరతీసింది. జాతీయ పక్షి నెమలి సహా ఇతర పశు పక్షాదులు, జంతువులు ఆనవాళ్లు కోల్పోయాయి.
- ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టీకం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. ఒక్క కాంగ్రెస్ మినహా ఎన్ఎస్యూఐతో సహా అన్ని పార్టీలు, వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
- రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో హెచ్‌సీయూ సందర్శించిన మీకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎస్కార్ట్ ఇచ్చి, పోలీసు బందోబస్తు కల్పించి నిరసనకు అవకాశం కల్పించింది. ఆ సందర్భంలో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని విద్యార్థులకు మీరు ఇచ్చిన హామీ గుర్తున్నదా? నేడు అదే యూనివర్సిటీలో మీ సీఎం రేవంత్‌రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరు స్పందించకపోవడం యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశించేదాకా సర్కారు విధ్వంసకాండను ఆపలేదు. ఈ విషయంలో మీరు, మీ పార్టీ మౌనంగా ఉండడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
- మీరు క్రోనీ క్యాపిటలిజానికి (ఆశ్రిత పక్షపాతం) వ్యతిరేకంగా, అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా గట్టిగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మీ ముఖ్యమంత్రి అదే అదానీకి రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించిన విషయం మీకు తెలియదా? అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి భూసేకరణకు నల్లగొండ జిల్లాలో రైతులపై పోలీసులు దాడి చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోలేదు?
- ఫార్మావిలేజ్ పేరిట పచ్చని పొలాల్లో చిచ్చురేపి, ఆదివాసీ రైతులను చితగ్గొట్టి, బేడీలు వేస్తే మౌనమునిగా చూస్తుండి పోయారెందుకు?
- ఒకపైపు మీరు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మరోవైపు మీ ముఖ్యమంత్రి ఆయనను బడే భాయ్ అని సంబోధిస్తున్న విష యం మీ దృష్టికి రాలేదా? ఇవన్నీ మీ అంగీకారంతోనే జరుగుతున్నాయా? తెలిసే మౌనం వహిస్తున్నారా? మీరు ప్రవచించే నీతి సూక్తులను మీ సీఎం పాటించేలా చూడాలని కోరుతున్నాం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

