Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డికి స్కూల్ పిల్లల పరేడ్‌తో స్వాగతం పలికించిన వికారాబాద్ కలెక్టర్ తీరును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని, ఎన్నో త్యాగాలు చేసి వచ్చే అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రజాసేవలో తమ పరిణతిని, బుద్ధి కుశలతను ప్రదర్శించాలని సూచించారు. అప్పుడే ప్రజల్లో అధికారుల పట్ల గౌరవ భావం ఏర్పడుతుందని తెలిపారు. భారత జాతీయ చిహ్నం మూడు సింహాలు తలెత్తుకొని ప్రజల పట్ల మనకుండే బాధ్యతను గుర్తు చేస్తాయని అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి.. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని అధికారులు తెలుసుకోవాలని సూచించారు.
వికారాబాద్ కలెక్టర్‌గా పని చేస్తున్న ప్రతీక్ జైన్ గతంలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా ఎంతో మంచి పేరున్న నిక్కచ్చి అధికారిగా పని చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ తలవంచి దండాలు పెట్టడం.. అర్హత లేని, కనీసం ప్రజలతో వార్డ్ నెంబర్‌గా కూడా ఎన్నుకోబడని వ్యక్తులను రెడ్ కార్పెట్ వేసి తనతో తీసుకెళ్తూ చదువుకునే చిన్నారులతో సెల్యూట్లు చేయించటం ఇది దేనికి చిహ్నమని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారుల పనితీరును పర్యవేక్షించే DoPT ఇది గమనించటం లేదా అని నిలదీశారు.
ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని, ఎన్నో త్యాగాలు చేసి వచ్చే అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రజాసేవలో తమ పరిణతిని, బుద్ధి కుశలతను ప్రదర్శించాలి. అప్పుడే ప్రజల్లో అధికారుల పట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. భారత జాతీయ చిహ్నం మూడు సింహాలు తలెత్తుకొని ప్రజల పట్ల మనకుండే బాధ్యతను గుర్తు చేస్తాయి.… pic.twitter.com/cv92VGh5Lb
— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025
కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ పాలన చేయటం ప్రజలు చూస్తూనే ఉన్నారని హరీశ్‌రావు అన్నారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఆ చిన్నారులకు మీరేం సందేశం ఇవ్వదలచుకున్నారని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అన్నకు, సీఎం కుటుంబసభ్యులకు ఇలా రాచ మర్యాదలతో స్వాగతం పలకాలని ఏ చట్టం చెబుతుందని ప్రశ్నించారు. కుటుంబపాలన చేస్తూ అక్రమ కేసులతో పైశాచికానందాన్ని పొందుతున్న అబద్ధాల సీఎం రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు.
పేరుకు ప్రజా పాలన,
ఇందిరమ్మ రాజ్యం.కానీ వికారాబాద్ లో మాత్రం
ఫ్యామిలీ పాలన
అనుముల రాజ్యాంగంహైదరాబాదులో వీళ్ళు ఉండడానికి ఖరీదైన విల్లాలు, ప్యాలెస్‌లు
సీఎం గురించి తెలిసిందే, లక్షలు విలువ చేసే టీ షర్టులు, చెప్పులు, షూలు
పిల్లలకు కనీసం చెప్పులు లేవన్న సోయి కూడా లేకుండా ఎండలో… https://t.co/MjkPfm99gu pic.twitter.com/0haAArfDV8
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025