Harish Rao | TS24 న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని విమర్శించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని అన్నారు.
అధికార బలంతో పోలీసులను మీడియాపై ఉసిగొల్పడం గర్హనీయమైన చర్య అని హరీశ్‌రావు మండిపడ్డారు. మహిళా జర్నలిస్టుపై అక్కసుతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం, సీసీ కెమెరా డేటాను స్వాధీనం చేసుకోవడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అని స్పష్టం చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనలో జర్నలిస్టులకు దక్కుతున్న గౌరవం ఇదని కొనియాడారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, పోస్టులు పెడితే భౌతిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా మీరు చెప్పిన సో కాల్డ్ ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను గుర్తుచేస్తున్నారని అన్నారు.
TS24 న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది .
మీడియా స్వేచ్ఛను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోంది.అధికార బలంతో పోలీసులను మీడియాపై ఉసిగొల్పడం… pic.twitter.com/UGasLfDeRw
— Harish Rao Thanneeru (@BRSHarish) February 21, 2025