హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఖరిని ప్రజలంతా నిలదీయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విజ్ఞప్తిచేశారు. ‘వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలుచేయకుండా రైతులు, కౌలు రైతులను నయవంచనకు గురిచేస్తున్న రేవంత్ నిరంకుశ వైఖరిని ఖండించండి’ అని ఆదివారం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.