హుజూరాబాద్ రూరల్, నవంబర్ 8: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎల్ఎండీ ప్రాజెక్టు మా జీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చొల్లేటి కిషన్రెడ్డి(63) పెండ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతిచెందారు. కిషన్రెడ్డి సమీప బంధువు కూతురి వి వాహం శుక్రవారం హనుమకొండలో జరిగింది. రాత్రి పోతిరెడ్డిపేటలో పెండ్లి బరాత్ నిర్వహించగా, కిషన్రెడ్డి డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
హుటాహుటిన హుజూరాబాద్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోతిరెడ్డిపేటకు తరలించారు. రాజ్యసభ మాజీ సభ్యు డు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎం పీపీలు సరోజన, రాణి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితోపా టు పలువురు కిషన్రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.