Road accident | రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత దుర్మరణం
Road accident | నల్లగొండ పట్టణం(Nallagonda) పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నేత జనార్దన్ రావు(BRS leader Janardhan Rao)రోడ్డు ప్రమాదంలో(Road accident) దుర్మరణం పాలయ్యారు.
నల్లగొండ : నల్లగొండ పట్టణం(Nallagonda) పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నేత జనార్దన్ రావు(BRS leader Janardhan Rao)రోడ్డు ప్రమాదంలో(Road accident) దుర్మరణం పాలయ్యారు. పానగల్ బై పాస్ నుంచి దుప్పలపల్లి వెళ్లే మార్గం మధ్యలో అతడి బైక్‌ను కారు ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుడు జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అందులో చురుకైన నేతగా ఎదిగారు. కాలక్రమంలో బీఆర్ఎస్లో చేరిన జనార్దన్ రావు కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో అనుంగ అనుచరుడు బీఆర్ఎస్ నేత జనార్డన్ రావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్న సమాచారం తెలిసిన కంచర్ల బ్రదర్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ లోకసభ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పాటు సీనియర్ నేతలు కాంచనపల్లి రవీందర్ రావు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు యాటా జయప్రద రెడ్డి సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

