Dasoju Sravan | గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మరణమృదంగాలా అని మండిపడ్డారు. ఎవరిదీ పాపమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. చిన్నారుల మరణాలన్నీ సర్కారీ హత్యలే అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ఉరఫ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అసమర్ధత కారణంగా తన సొంత జిల్లాలోని మక్తల్ మండలం మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగిందని దాసోజు శ్రవణ్ అన్నారు. మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులకు వాంతులు, తల నొప్పి, కడుపు నొప్పితో విద్యార్థులు విలవిలలాడిపోయారని పేర్కొన్నారు. మక్తల్ ఆస్పత్రికి 30 మంది విద్యార్థులను తరలించారని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల మరణించారని దాసోజు శ్రవణ్ తెలిపారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారని అన్నారు. ఈ పాపం ఎవరిదీ అని ప్రశ్నించారు. ప్రత్యేక విద్యా శాఖ మంత్రి, పూర్తి బాధ్యతలతో ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించకుండా రేవంత్ రెడ్డి నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారని.. ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్లో బిజీగా ఉన్నారని.. ఈ ఘటనలపై కనీస రివ్యూ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో తమ నిర్లక్ష్యంతో, అసమర్ధతతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరనేరానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ప్రజాకోర్టులో శిక్షార్హులే అని స్పష్టం చేశారు.
హాస్టళ్లలో మరణమృదంగాలా? హవ్వ!-
రేవంత్ .. ఎవరిదీ పాపం? – చిన్నారుల మరణాలన్నీ సర్కారీ హత్యలే-ముఖ్యమంత్రి ఉరఫ్ విద్యాశాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, మరియు అసమర్ధత కారణంగా తన స్వంత జిల్లాలో తాజాగా మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్… pic.twitter.com/uCiFOPHRGm
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) November 26, 2024