Dasoju Sravan | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్, హరీశ్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌ను 2023లోనే నామినేట్ చేశామని.. కానీ అప్పుడు బీజేపీ ఆపిందని గుర్తుచేశారు. అందుకే కేసీఆర్ మళ్లీ గుర్తించి దాసోజు శ్రవణ్‌కు అవకాశం కల్పించారని తెలిపారు.