హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెకిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొకిన కాంగ్రెస్ సరార్ రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెకలతో సహా ప్రజల ముందుంచేందుకు తాము ‘కాంగ్రెస్ బాకీకార్డు’ ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను బాకీకార్డు చూపించి నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ మంత్రులతో కలిసి ‘బాకీ కార్డు’పోస్టర్‌ను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయని అన్నారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా ప్రజలకు వచ్చిందని అన్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీకార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతిఒకరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
కేసీఆర్ చెప్పిందే నిజమైంది
మోసపోతే గోస పడతామని ఎన్నికల ముం దు కేసీఆర్ పదేపదే చెప్పారని, ఇవాళ అదే నిజమైందని కేటీఆర్ వాపోయారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని కానీ, ఇప్పటివరకు 30కి పైగా క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టిన రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార నేడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధును కూ
8 లక్షల తులాల బంగారం బాకీ
‘అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభు త్వం వారిని అడుగడుగునా దగా చేస్తున్నది. ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్న హామీ ఏమైం ది? అది బాకీ. రూ. 2 లక్షల రుణమాఫీ ఊసేలేదు, అది బాకీ. వరికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు. అది కూడా బాకీనే. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేడు. వారికి ఇస్తామన్న రూ.15,000, రూ.12,000 ఏ గంగలో కలిపారు? ఇవన్నీ బాకీ కాదా? మా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. 2 లక్షల ఉద్యోగాల హామీ బాకీ. నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడింది. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి, ఈ రోజు వరకు ఒకో మహిళకు దాదాపు 55,000బాకీ పెట్టారు. ఈ ప్రభు త్వం వచ్చాక పెళ్లయిన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ.?’ అని కేటీఆర్ మండిపడ్డారు.
వృద్ధులు, వితంతువుల ఉసురు తగుల్తది
‘వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదు. నెలకు రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి 22 నెలలుగా ఒకొకరికీ రూ. 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగుల విషయంలో మరీ దారుణం. నెలకు రూ. 6,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేసీఆర్ పెంచిన రూ. 4,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రతి నెలా రూ. 2,000 కోత పెడుతూ, ఒకో దివ్యాంగుడికి రూ. 44,000 బాకీ ఉన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు బాకీ. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు 250 గజాల స్థలం బాకీ. విద్యార్థినులకు సూటీలు, యువతకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఆటో అన్నలకు రూ. 24,000.. అన్నీ బాకీలే. గృహజ్యోతి పథకం కూడా సరిగా అమలు కావడం లేదు. చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ బాకీల చిట్టా చాంతడంత ఉన్నది. ఈ మోసాలను ప్రజల ముందు ఎండగడతాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషులో బాకీ కార్డులు
ప్రజల తరఫున గొంతు విప్పుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఓ వైపు న్యాయపరంగా పోరాడుతూనే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నయవంచనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో ఈ బాకీ కార్డులను ముద్రించామని, ఈ ప్రచారానికి మీడియా కూడా సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
రేవంత్‌రెడ్డి కటింగ్ మాస్టర్: హరీశ్‌రావు
చీఫ్ మినిస్టర్ రేవంత్‌రెడ్డి కటింగ్ మాస్టర్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రారంభించిన పనులు, ప్రాజెక్టులు, భవనాలకు రిబ్బన్ కటింగ్ చేస్తూ, కేసీఆర్ అమలు చేసిన పథకాలకు కటింగ్ (కోత) పెడుతున్నారని, అయితే రిబ్బన్కటింగ్ లేదంటే సంక్షేమ పథకాలకు కటింగ్ అని ఎద్దేవా చేశారు. ‘అభయహస్తం అన్నరు, బాండ్ పేపర్లు పంచారు. ఇది అభయహస్తం కాదు. అచేతన హస్తం అని ప్రజలకు అర్థమైంది. ఆనాడు గాంధీ టోపీలు పెట్టి, ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచారు. గ్యారెంటీ కార్డు గాసిప్ కార్డు అయిపోయింది. వంద రోజుల్లోనే అమలు చేస్తాం.. అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తాం అన్నారు. రేవంత్ మాటలు ప్రజలు నమ్మరని గాంధీలతో ప్రచారం చేయించారు. ఆ గాంధీలు ఈ రోజు హైదరాబాద్‌కు రాని పరిస్థితి. ఎకడ నిలదీస్తారో అని వారికి భయం. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఎందుకు ముఖం చాటేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి అమలు చేయడం లేదు. ఎందుకు ప్రశ్నించడం లేదు’ అని నిలదీశారు. తెలంగాణలోని అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి సర్కారు మోసం చేసిందని, అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో భాగంగా బాకీ కార్డు విడుదల చేశామని చెప్పారు. కాంగ్రెస్ మెడలు వంచేందుకే బాకీకార్డు ఉద్యమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని చెప్పారు.
రాష్ర్టాన్నే మోసం చేసింది: మధుసూదనాచారి
వ్యక్తులనే కాదు తన మాయమాటలతో రాష్ట్రం మొత్తాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో చేసిన మోసం దేశంలో మరెవ్వరూ చేసి ఉండరని చెప్పారు. ఓ మూర్ఖుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ మోసాలు అర్థం అయ్యాయని, హస్తం పార్టీకి గుణపాఠం చెప్పే అవకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
అలీబాబా 40 దొంగల్లాగా కాంగ్రెస్ నేతలు: తలసాని శ్రీనివాస్‌యాదవ్
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దించాలని ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. అలీబాబా 40 దొంగల్లా కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సస్యశామలంగా మారిందని, ఎవరూ ఊహించని పథకాలు కేసీఆర్ తెచ్చారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం హైడ్రా భూతాన్ని పేదలపై వదిలిందని అన్నారు. కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో ఓటేస్తే ఉన్న పథకాలు కూడా ఊడుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మోసానికి ప్రతిరూపం కాంగ్రెస్: మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ
మోసానికి ప్రతిరూపం కాంగ్రెస్ అని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు. ఈ ప్రభుత్వం నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ మళ్లీ గెలిచే పరిస్థితి లేదని తెలిపారు. మైనారిటీలకు కాంగ్రెస్ మంత్రివర్గంలో చోటే దకలేదని, మైనారిటీలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలకు ఇప్పటివరకు ఎంత మొత్తం బాకీ ఉన్నదో, హామీల వైఫల్యంతో ప్రజలకు ఎంత బాకీ పడిందో బాకీ కార్డుల్లో వివరించినట్టు చెప్పారు.
డీజీపీకీ నియామక పత్రం: సబితాఇంద్రారెడ్డి
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు రేవంత్ నియామక పత్రాలు ఇస్తూ తిరుగుతున్నారని, చివరకు కొత్త డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. డీజీపీకి నియామక పత్రం ఇచ్చిన సీఎం గతంలో ఎవరూ లేరని అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు బాకీ పడ్డట్టే మహిళలకు బాకీ పడిందని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయి. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ దోఖాకు బదులు తీర్చుకునే మోకా ప్రజలకు వచ్చింది. కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిగ్గదీసి అడగడానికే ఈ బాకీకార్డు ఉద్యమం. -కేటీఆర్
మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, భయపడే ప్రసక్తే లేదు. న్యాయపరంగా పోరాడుతూనే, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. -కేటీఆర్
మోసపోతే గోస పడతామని ఎన్నికల ముందు కేసీఆర్ పదేపదే చెప్పారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇప్పటివరకు 30కి పైగా క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదు. -కేటీఆర్