హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది. అందుకే పిచ్చికూతలు కూస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు, సెక్రటేరియట్ వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహం తదితర పరిణామాలపై ఆయన ఓ జాతీయ న్యూస్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
మేం మొదటి నుంచి చెప్తున్నాం. చట్టం కండ్లుగప్పి ఎంతోకాలం ఉండలేరు. హై కోర్టు తీర్పు తర్వాత మంత్రి, ముఖ్యమం త్రి చేస్తున్న వ్యాఖ్యలే సాక్ష్యం. సీఎం రేవంత్‌రెడ్డి మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పితే.. మంత్రి శ్రీధర్‌బాబు వాళ్లు వాళ్లు చూసుకోవాలంటరు.. వాళ్ల పార్టీతో మాకేం సంబం ధం అంటరు.. 10 మంది బీఆర్ఎస్ ఎ మ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొని హై కోర్టు తీర్పు రాగానే సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. మంత్రి, సీఎం ఎవరిని పిచ్చోళ్లను చే స్తున్నట్టు? కండువా కప్పినోడిది తప్పా? మాకేం సంబంధం లేదన్ననోడిది తప్పా? వాళ్లే తేల్చుకోవాలి. ఫిరాయింపుల నిషేధ చట్టం విషయంలో సుప్రీం కోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం తో నాటకాలు మొదలయ్యాయి. పార్టీ మా రిన ఎమ్మెల్యేలు ఎటూ కాకుండ పోతరు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టినందుకే మా అభ్యంతరం. దేశంలో, రాష్ట్రంలో రా జీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ పేర్లతో అనేక సంస్థలు ఉన్నాయి. తెలంగాణ ఔటర్ రింగ్‌రోడ్డుకు నెహ్రూ, యూనివర్సిటీకి ఇందిరాగాంధీ (ఇగ్నో), విమానాశ్రయానికి, స్టేట్ హైవేస్‌కు రాజీవ్‌గాంధీ పేర్లున్నాయి. వాటికి మేమెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఒక్కపేరు కూడా మార్చలేదు. మాజీ ప్రధానిగా దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను మేమేనాడూ విస్మరించలేదు. వారి కీర్తిని తగ్గించలేదు.
కానీ, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా రాజీవగాంధీ విగ్రహం పెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ అమరులకు నివాళిగా అమరజ్యోతి ని ర్మించుకున్నాం. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకు న్నాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించి కుర్చీని కాపాడుకోవటం కోసం సోనియా, రాహుల్దగ్గర మార్కులు కొట్టేయటం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్‌గాం ధీ విగ్రహాన్ని పెట్టాడు. అసలా విగ్రహం రాజీవ్గాంధీది కాదు రాహుల్గాంధీదని అంటున్నారు. ఆ వివాదంతో మాకు సంబంధం లేదు.
అధికారం కోసం హామీలిచ్చి ప్రజలను మోసం చేయవచ్చన్నదే కాంగ్రెస్ విధానం గా మారింది. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో హామీలిచ్చారు. తెలంగాణ లో 6 గ్యారెంటీలు అందులో 420 హామీ లు. ఎన్నికల సమయంలో అరచేతిలో వై కుంఠాన్ని చూపారు. కానీ జరిగింది శూన్యం. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు గంజాయి సాగు ను చట్టబద్ధం చేస్తామంటున్నారు. దీనిపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి.
అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? 30 రోజుల్లో 13 హత్యలు.. పత్రికల పతాక శీర్షికల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి కథనాలు వచ్చినయ్. ఉసిగొలిపే చర్యలు తప్ప బాధ్యతాయుత పాలన సాగుతున్నదా? పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడైనా ఇలాంటి పరిస్థితిని చూశామా? అని ప్రజలు బాధపడుతున్నా రు. ఇప్పుడు ఒక్క శాంతిభద్రతలే కాదు.. రాష్ట్రంలో పాలన మొత్తం గాడితప్పింది.
రాజీవ్‌గాంధీని అవమానిస్తున్నదే రేవంత్‌రెడ్డి. కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్ అయితే రాజీవ్‌గాంధీ కనిపెట్టిండు అని, 1956లో రాజీవ్‌గాంధీకి 12 ఏండ్ల వయస్సున్నప్పుడు దేశంలో కంప్యూటర్ సేవలను టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ (టిఫ్రాక్) ప్రారంభిస్తే దాన్ని రాజీవ్‌గాంధే పరిచయం చేశారని నోటికొచ్చినట్టు వాగుతూ ఆయనను రేవంత్‌రెడ్డే అవమాన పరుస్తున్నారు. చిట్టినాయుడు తనకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్మెయిల్.. వీటికే పరిమితం కావాలి కానీ, సుభాషితాలు ఎందుకు?