Padi Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే సమయంలో అడ్డుకుని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండించింది. సొంత మండలమైన వీణవంకలో జరుగుతున్న జాతరకు పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా ప్రదేశాలను, ముఖ్యంగా మతపరమైన, సాంస్కృతిక మహాకార్యక్రమాలను సందర్శించడం ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఒక బాధ్యత ఉంటుందని జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. సమ్మక్క జాతర సందర్భంగా ప్రజల ఇబ్బందులు తెలుసుకొని, సంబంధిత అధికారులకు సూచనలు చేయడం ప్రజాప్రతినిధి ముఖ్యమైన కర్తవ్యమని అన్నారు. ఈ విధిని నిర్వర్తించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకోవడం సరైన చర్య కాదని జిల్లా పార్టీ అభిప్రాయపడుతోందని చెప్పారు. ఎమ్మెల్యేకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రోటోకాల్‌ను గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను నిర్వర్తించే సమయంలో సహకారం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు పునఃసమీక్ష చేయాలని జీవీ రామకృష్ణారావు కోరారు. ప్రజాప్రతినిధుల విధులు,బాధ్యతలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే @KaushikReddyBRS గారిని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే సమయంలో అడ్డుకుని అరెస్టు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
సొంత మండలమైన వీనవంక మండలంలో జరుగుతున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మ జాతర… pic.twitter.com/WbkfSsRexk
— BRS Party (@BRSparty) January 30, 2026