మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన సిరిసిల్లలో రెడీమేడ్ రంగం వైపు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం తో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో రూ.175 కోట్లతో 65 ఎకరాల్లో రూపుదిద్దుకున్న అప్పారెల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర తయారీ దిగ్గజ సంస్థ ‘టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్’ రూ.75 కోట్లతో స్థాపించిన ‘పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్’ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇందులో టీ షర్టులు, జీన్స్ ప్యాంట్ల తయారీతో 2 వేల మందికి ఉపాధి లభించనున్నది.