కామారెడ్డి, ఏప్రిల్ 22 : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోయిన నాయకులను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని, మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.