అందోల్ ;ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్, కొడెకల్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ మ్యానిఫెస్టోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి వివరించగా వారి నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ‘బీఆర్ఎస్సే మనకు అండాదండ’ అని స్థానికులు నినదించారు.