శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిస్తే.. నేడు అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అధోగతి పాలైందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి అన్నారు. సోమవారం శంషాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగవైభవంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాక గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరగలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. ప్రకాశ్‌గౌడ్ పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టమేమీలేదని స్పష్టంచేశారు.