హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అన్ని వర్గాలు, కులాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ రేవంత్‌రెడ్డిలో అగ్రకుల అహంకార ధోరణి పోలేదని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
‘రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే.. కులగణన చేస్తున్నా’ అనడం రేవంత్‌లోని అగ్రకుల అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. దీనిని బట్టి ఆయన రాజ్యాంగబద్ధమైన సీఎం సీటులో కూర్చునేందుకు అనర్హుడని బుధవారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.