ఇక రెండో ఫొటో& ఆత్మీయ సమ్మేళనాల పేరిట బీఆర్ఎస్ ప్రతినియోజకవర్గంలో భారీ సభలు నిర్వహించింది. తన మన తేడా లేకుండా వచ్చిన వేలాది మందితో మమేకమై, భోజనాల వేళ కొసరికొసరి వడ్డిస్తూ, వారికి పెట్టిందే తాము తింటున్న మంత్రివర్యులను చూడొచ్చు. ఇదే కాదు.. ఏ చిన్న సభ నిర్వహించినా బీఆర్ఎస్ నేతలు ప్రజల కోసం మజ్జిగ ప్యాకెట్ల దగ్గర్నుంచి గ్లూకోజ్ ప్యాకెట్ల దాకా ప్రతిదీ సమకూరుస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వేలాది మందికి సరిపడా భారీ టెంట్లు వేయటం, అందులోనూ ఫ్యాన్లు ఏర్పాటు చేసి ఎంతసేపు కూర్చున్నా.. హాయిగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం వెలుపల మహారాష్ట్రలాంటి పొరుగు రాష్ర్టాల్లో ఏర్పాటు చేసే సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సకల వసతులు కల్పిస్తున్నది.