హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ(BRS )నాయకుల అక్రమ అరెస్టుల పై ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవు తున్నా యి. తమ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు రహదారులను దిగ్బం ధం చేశారు. నేడు జరగనున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలను పోలీ సులు ఎక్కడికక్కడ అరెస్టు(House arrests) చేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతి పరులు ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
కాగా, బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలన్నారు.
నారాయణపేట జిల్లాలో
రంగారెడ్డి జిల్లాలో
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
మెదక్ జిల్లాలో పద్మాదేవేందర్ రెడ్డి హౌజ్ అరెస్ట్..
ములుగు జిల్లాలో
పెద్దపల్లి జిల్లాలో
జనగామ జిల్లాలో
కరీంనగర్ జిల్లాలో..