CM KCR | సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రతినిధుల సభ
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు.

అంతకుముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు.

22 ఏండ్ల కింద జలదృశ్యం వేదికగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్ గత సంవత్సరం విజయదశమినాడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. 14 ఏండ్ల స్వరాష్ట్ర ఉద్యమ ప్రస్థా నం, ఎనిమిదిన్నరేండ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అప్రతిహత కొనసాగింపు, అనతికాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నా రు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో పార్టీకి వ స్తున్న ఆదరణ, అనంతర కార్యాచరణ వంటి అంశాలను శ్రేణులకు వివరించనున్నారు. బీజే పీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు బీఆర్ఎస్పై కావాలని బురదజల్లే కుట్రలు ఎలా చేస్తున్నారు? వాటిని ఎలా తిప్పికొట్టాలి? క్షేత్రస్థాయిలో ప్రజలతో పార్టీ శ్రేణులు ఎలా మసలుకోవాలి? వంటి అంశాలపై అధినేత, సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు.

బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ కా వటంతో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరిపాలనా తీర్మానాలు ఉం డే అవకాశాలున్నాయి. దళితబంధు పథకం, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానం ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో నేడు జరిగే ప్రతినిధుల సమావేశం కీలకం కానున్నది. ఈనెల 30న బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం, జూన్1న అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణ ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే అంశంపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

