BRS President KCR | దశాబ్దాలుగా దోపిడీకి గురైన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందే గులాబీ జెండా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం కేసీఆర్ సమక్షంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. `కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు ఇప్పటికే బాధ పడుతున్నరు. తెలంగాణ వాదానికి బహుజన వాదానికి అత్యంత సామీప్యత ఉన్నది. ఆచరణాత్మక ఎజెండాతో ప్రజలకు అండగా నిలబడదాం. తెలంగాణ ఉద్యమంతో ఒక శూన్యం నుండి సుడి గాలి సృష్టించిన చరిత్ర నాది. దేశానికి టార్చ్ బేరర్ గా నిలిచే కార్యాచరణ రూపొందించుకుందాం` అని చెప్పారు.
`ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అత్యంత కమిట్ మెంట్ కలిగిన నాయకుడు. తెలంగాణ ప్రజల మేలు కోసం
ఇంకా అద్భుతమైన ఆలోచనలు చేస్తాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజలకు మంచి చేయాలనే తపనే మళ్ళీ మనల్ని ప్రజలకు దగ్గర చేస్తుంది. పార్టీ పునః నిర్మాణం చేపట్టి అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తాం. శిక్షణా తరగతులతో ఒక మంచి ఎజెండాతో పని చేయబోతున్నాం` అని కేసీఆర్ ప్రకటించారు.
`తెలంగాణ ఉద్యమ ప్రస్థానం లో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు కలిసినం. 36 పార్టీలను ఏకతాటిమీదికి తెచ్చినం. కేంద్ర మంత్రి పదవిని కూడా తెలంగాణ సాధన కోసం ఉపయోగించిన.
తెలంగాణ కోసం…వచ్చినోళ్లాకాల్లా `స్టిల్ సికింగ్ జస్టిస్`అనే వీడియో చూయించిన. హైదరాబాద్ వచ్చినోళ్లకు బిర్యాని తినిపిద్దును. నన్ను సూడంగానే జోకులు వేసుకునే వాళ్లు..మల్లా వచ్చిండు రా అని
కానీ మన పట్టుదల చూసి అందరూ మద్దతిచ్చిండ్రు` అని కేసీఆర్ గుర్తు చేశారు.
`మాయావతి గారి దగ్గెరికి 18 సార్లు పోయిన. మీ బహుజన్ కాజ్ నా తెలంగాణ కాజ్ ఒకటే నని చెప్పి ఒప్పించిన. ఒక పని సాధించాలంటే పట్టుదల అవసరం అనే విషయం ఉద్యమం మనకు నేర్పుతుంది.
గురుకుల విద్యను అభివృద్ధి చేసి ప్రవీణ్ కు ఎంతో సహకరించిన. దళిత బహుజన బిడ్డలను విద్యావంతులను చేసిన… దేశ విదేశాల్లో వాళ్లు ఇవ్వాల ఉన్నత స్థాయిలో ఎదిగిండ్రు` అని కేసీఆర్ చెప్పారు.
`మీకు ఏ పార్టీలో లేని స్పేస్ బీఆర్ఎస్లో ఉంటుంది. ఇక్కడే నిరంతర శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం. పార్టీ నిర్మాణం చేసుకుందాం. కమిటీలు వేసుకుందాం. మనం అద్భుతమైన విజయం సాధిస్తాం. బహుజన సిద్ధాంతాన్ని ఎజెండా బలంగా అమలు చేసే దిశగా భారత దేశానికి టార్చ్ బేరర్ గా పనిచేయాలే. బహుజన బేస్ ను నిర్మిద్దాం. ఒక అనివార్యతను సృష్టిద్దాం. ప్రవీణ్ డెడికేటెడ్ పర్సన్. రెసిడెన్షియల్ విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా నిలిపాడు. మనం కష్టపడితే నెక్స్ట్ టర్మ్ లో నూటికి నూరు శాతం బిఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ పాలన మీద మున్నెళ్లకే ముక్కు ఇరుతాండ్రు జనం. కనీసం మిషన్ భగీరథ మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేక పోతున్నారో అర్థం కాట్లేదు` అని కేసీఆర్ పేర్కొన్నారు.
`త్వరలో ప్రవీణ్‌ను బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా. భవిష్యత్‌లో కూడా ఉన్నత స్థానంలో ఉంటాడు. ప్రవీణ్ ను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్న..మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం.
మంచి ఆశయం కోసం పనిచేసిన మీకు రాజకీయ సామాజిక ఫలితాలు ఉంటాయి. ఆచరణ యోగ్యమైన కార్యాచరణతో ప్రజల్లో కలిసి పని చేద్దాం.. ఫలితాలు సాధిద్దాం.. దళిత శక్తినీ ఏకం చేసేందుకు
బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు మనం నడుం కడుదాం. కలిసి ఎజెండా తయారు చేద్దాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నిరుత్సాహపరిచిండ్రు కానీ వెనక్కుపోలె. ఇప్పుడు కూడా అంతే ముందుకు పోదాం. కన్విక్షన్ ఉంటే అసాధ్యం ఏమి వుండదు` అని కేసీర్ అన్నారు.
1. డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ (రిటైర్డ్) బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు,
2. కందికంటి విజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
3. విజయ్ ఆర్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
4. దాసరి హనుమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
5. పూదరి సైదులు, రాష్ట్ర కార్యదర్శి,
6. అరుణ రాణి, రాష్ట్ర కార్యదర్శి,
7. నర్రా నిర్మల, రాష్ట్ర కార్యదర్శి,
8. జక్కని సంజయ్, రాష్ట్ర కార్యదర్శి,
9. మల్లేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి,
10. రాజరత్నం, రాష్ట్ర కోశాధికారి,
11. శ్యాంరావ్ జాడే, రాష్ట్ర మాజీ సభ్యుడు,
12. పుట్టల శీలజ, రాష్ట్ర మాజీ సభ్యుడు,
13. ఎం.కేశవరావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి,
14. మంద శ్యామ్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి,
15. జన్ను స్వరూప, నార్త్ జోన్ మహిళా కన్వీనర్,
16. ఇంద్రవెల్లి కవిత, సౌత్ జోన్ మహిళా కన్వీనర్,
17. పెద్దపల్లి అభ్యర్థిగా పోటీ చేసిన దాసరి ఉష,
18. చొప్పదండి అభ్యర్థిగా పోటీ చేసిన కొంకటి శేఖర్
19. కల్వకర్తు అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్,
20. వైరా అభ్యర్థిగా పోటీ చేసిన రాంబాబు నాయక్,
21. రాకేష్, బీవీఎఫ్ రాష్ట్ర కన్వీనర్
22. బాబు నాయక్, బీవీఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్
23. పల్లవి స్వేరో, బీఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్
24. సురేష్ కొడిదెల, బిట్సెల్ రాష్ట్ర కన్వీనర్
25. ముస్త్యాల కిషన్, ఆర్ఎస్పీ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు
26. మహేందర్ నాయక్, ఆర్ఎస్పీ గిరిజన సేన రాష్ట్ర అధ్యక్షుడు
27. ఎ.నటరాజ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
28. సునీల్ రుద్రవరం, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు
29. చాట్ల చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు-హైదరాబాద్
30. ఆదిమల్ల గోవర్ధన్, జిల్లా ఇంచార్జి-నల్గొండ
31. ఆదిమల్ల గోవర్ధన్, జిల్లా ఇంచార్జి-నల్గొండ
32. ఉప్పల జహంగీర్, జిల్లా ఇంచార్జి-యాదాద్రి
33. అమ్మవోడి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు-హన్మకొండ
34. తాళ్లపల్లి వెంకటస్వామి, జిల్లా ఇంచార్జి-జనగావ్
35. ఓంకార్ యాదవ్ జిల్లా, ఇంచార్జి-హన్మకొండ
1. అకినేపల్లి శిరీష, రాష్ట్ర మహిళా కన్వీనర్
2. మేకల రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
3. ముర్మూరు శేఖర్,పెద్దపల్లి జిల్లా ఇంచార్జి
4. మహ్మద్ షమీ, చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షుడు
5. ఎం.వినోద్, సంగారెడ్డి అసెంబ్లీ అధ్యక్షుడు
6. పల్లవి జిల్లా, సంగారెడ్డి మహిళా కన్వీనర్
7. మల్లేష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
8. అనిత, కంది మండల కన్వీనర్
9. శ్రీనివాస్, మండల అధ్యక్షుడు-సదాశివపేట
10. ప్రశాంత్ మండలం పి
11. పొన్న జనార్దన్, జిల్లా అధ్యక్షుడు-మెదక్
12. మధు మహారాజ్, జిల్లా అధ్యక్షుడు-భద్రాద్రి
13. బొట్ల ప్రస్థాన్ స్వరోస్, స్టేట్ సోషల్ మీడియా ఇంచార్జి
14. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రాచమల్ల జయసింహ
15. కె.బ్రహ్మయ్య, జిల్లా ఇంచార్జి-నాగర్‌కర్నూల్
16. కొండా భీమయ్య, జిల్లా అధ్యక్షుడు-సూర్యాపేట
17. లెందుగూరే శ్యాంరావు, జిల్లా అధ్యక్షులు-కొమ్రంభీం
18. ఆవుల రాజ్ కుమార్, జిల్లా కార్యదర్శి-కొమ్రంభీం
19. కొండా రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి-కొమ్రంభీం
20. నవీన్ రాంటెంకి, జిల్లా కోశాధికారి-కొమ్రంభీం
21. అమ్మ శ్రీకాంత్, అసెంబ్లీ కార్యదర్శి-సిర్పూర్
22. కాశిక రాజు, జిల్లా సభ్యుడు
23. దాసరి నరేందర్, అసెంబ్లీ కమిటీ సభ్యుడు
24. ఇరుగుల రమేష్ ,మండల అధ్యక్షులు-చొప్పదండి
25. మాచర్ల రోహిత్, టౌన్ అధ్యక్షుడు-చొప్పదండి
26. కె.బ్రహ్మయ్య, జిల్లా ఇంచార్జి-నాగర్‌కర్నూల్
27. లక్ష్మీ ఆనంద్, జిల్లా మహిళా కన్వీనర్-మేడ్చల్
28. మీదింటి సురేందర్, మండల అధ్యక్షుడు-బిజినేపల్లి
29. మీదింటి మనోహర్, మండల అధ్యక్షుడు-తిమ్మాజీపేట
30. చార్మినార్ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన అబ్రత్ హుస్సేన్,
31. కతుల పద్మ, అసెంబ్లీ మహిళా కన్వీనర్-మునుగోడు
32. సూగూరి బాబు, అసెంబ్లీ ఇంచార్జి-అచ్చంపేట
33. గద్వాల్ అభ్యర్థి పోటీ చేసిన అతికూర్ రెహ్మాన్
34. మధు గౌడ్, అసెంబ్లీ ఇంచార్జి-అలంపూర్
35. కంకం బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి-గద్వాల్
36. డి.నాగరాజు, మండల అధ్యక్షుడు-అలంపూర్
37. బి.మహేష్, అసెంబ్లీ అధ్యక్షుడు-అలంపూర్
38. సుజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి-జనగాం
39. ముత్యాల, మహేందర్ రంగారెడ్డి
40. ముప్పరపు ఎల్లయ్య, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బిట్సెల్ ఇంచార్జి
41. నక్కా మనోహర్, టౌన్ ప్రెసిడెంట్-కాగజ్ నగర్
42. రేణుకుంట్ల శ్రీనివాస్, టౌన్ వైస్ ప్రెసిడెంట్-కాగజ్ నగర్
43. తన్నేరు పోశం, టౌన్ వైస్ ప్రెసిడెంట్-కాగజ్ నగర్
44. మారుపాక శోభన్, పట్టణ కార్యదర్శి-కాగజ్ నగర్
45. ఇల్లందుల ప్రణి, సోషల్ మీడియా ఇంచార్జి-ఖగజ్‌నగర్
46. చందు, మండల అధ్యక్షుడు-తలకొండపల్లి
47. రిటైర్డ్ ఎమ్మార్వో హనుమంతరావు,
48. తోకల కృష్ణ, జిల్లా ఇంచార్జి-మహబూబ్ నగర్
49. వ్యాపారవేత్త రాజేష్ కిరణ్
50. డాక్టర్ తిక్క వినోద్ కుమార్ -హన్మకొండ