ఆదిలాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన నేటి నుంచి ప్రారంభంకానుంది. నెలపాటు జరిగే పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ కమిటీ పర్యటించనున్నది. జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు దేవ్రావ్ కుటుంబాన్ని పరామర్శించి రామాయిలో, యాపల్గూడలో రైతులతో సమావేశం కానున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో 13 నెలలల్లో 33 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేక దేవ్రావు బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 30 వేల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కావాల్సి ఉండగా, రెండు పంటలకు రైతు భరోసా అందలేదు.
దీంతో రైతులు సాగు కోసం బ్యాంకులు, ప్రైవేటు, దళారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తున్నది. దిగుబడులు లేక అప్పులు తీర్చక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 90 శాతం రైతులు పత్తి సాగు చేస్తారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521తో కోనుగోలు చేయాల్సిన సీసీఐ రైతులను నట్టేట ముం చుతున్నది. నాణ్యత పేరిట క్వింటాలుకు రూ.100 తగ్గించి ,421తో కొనుగోలు చేస్తున్నది.