Rasamai Balakishan | సంగారెడ్డి : ఇవాళ చేసింది జమ్మి పూజ కాదు.. రాబోయే పోరాటానికి హరీశ్‌రావు ఆయుధ పూజ చేశారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాదనుకున్న తెలంగాణనే సాధించాం.. వచ్చిన తెలంగాణను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని రసమయి పిలుపునిచ్చారు. అందోల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో రసమయి బాలకిషన్ పాల్గొని ప్రసంగించారు.
నా చిన్నతనం అంతా జోగిపేటలోనే సాగింది. స్థానికులతో ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ఎంతో తిప్పలువడి తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఉద్యమ రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి. బతుకమ్మ పండుగకు కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవారు. గత పదేండ్లలో దసరా, బతుకమ్మ పండుగలను గొప్పగా నిర్వహించుకున్నాం. ఇవాళ ఆ రోజుల్లేవు. ఈ ఏడాది బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్లే కట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి రసమయి వ్యంగ్యస్త్రాలు సంధించారు.
అలయ్ బలయ్ సందర్భంగా ఇవాళ జరిగింది జమ్మి చెట్టుకు పూజ కాదు. తెలంగాణ సాయుధ పోరాటానికి హరీశ్‌రావు ఆయుధ పూజ చేసిండు. ఈ ఆయుధాలను మళ్లా పట్టుకుందాం.. విడిచిపెట్టేది లేదు. రాదనుకున్న తెలంగాణనే సాధించాం. వచ్చిన తెలంగాణ కోసం కొట్లాడాలి. ఈ ఒక్క ఊరిలోనే దుఃఖం లేదు.. అన్ని ఊర్లలో ప్రజలు దుఃఖంతో ఉన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరితోనైతే కొట్లాడి తెలంగాణను సాధించామో.. ఇప్పుడు వాన్ని వెళ్లగొట్టే వరకు ఒక్కటిగా నిలబడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. భూమి సూర్యుని చుట్టు తిరుగుతున్నట్టు.. హరీశ్‌రావు తెలంగాణ చుట్టు తిరుగుతున్నాడని రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
జమ్మి పూజ కాదు.. రాబోయే పోరాటానికి ఆయుధ పూజ చేశాడు హరీష్ రావు.
బతుకమ్మ చీరలు పంచకుండ కాంగ్రెస్ వాళ్లు కట్టుకుంటున్నారేమో మరి – మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ pic.twitter.com/EM4s48wmZi
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్ స్ఫూర్తితో ఓ నిరుపేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు ఎన్నారై దూడల వెంకట్ సాయం..
Musi River | మా ఇండ్లను కూల్చకండి.. మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిసిన హైకోర్టు స్టే ఆర్డర్లు
TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఐదురోజులు వానలే వానలు..