Peddi Sudarshan Reddy | వరంగల్ : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.
బొగ్గు గని ప్రతిపాదించిన ప్రాంతం రామప్ప దేవాలయానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కేంద్రం ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల మైనింగ్ వల్ల రామప్ప ఆలయ ఆనవాళ్లకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఈ దేవాలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ల ప్రతిపాదన విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయి.
బొగ్గు గని ప్రతిపాదించిన ప్రాంతం రామప్ప దేవాలయానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కేంద్రం ప్రతిపాదించిన… pic.twitter.com/nWi7u2lWqu
— BRS Party (@BRSparty) May 12, 2025