Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు భయపడే ప్రసక్తే లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ పౌరుషం ఉన్నోళ్లం.. గాజులు పెట్టుకొని కూర్చోలేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారు.. ఇప్పుడు ఈ కేసులకు భయపడేది లేదు. నాగర్కర్నూల్ జిల్లాలోని కొంత మంది పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారు.. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
మనం కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా..? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎందుకు భయపడుతున్నారు. న్యాయం, ధర్మం మన వైపు ఉన్నంతవరకు మనని ఎవరు ఏం చేయలేరు అని మర్రి జనార్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు.