కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించినట్టు తెలిసింది. కాగా ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతున్నది.