రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో స్వయంభు శ్రీ మహంకాళీ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు (Navaratri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. పదో రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని ( Mahishasura Mardini ) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారిని దర్శించడానికి చుట్టుపక్కల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి ,ఆలయ ఆస్థాన అర్చకులు పూసాల మహేష్ శాస్త్రి ఆధ్వర్యంలో మహా చండీయాగం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్, సుకన్య దంపతులు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. గురువారం విజయ దశమి దసరా పండగ పురస్కరించుకొని సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుందని అర్చకులు వెల్లడించారు.