Gadari Kishore | హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేసి చనిపోతే పీడ పోతదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గాదరి కిశోర్ మీడియాతో మాట్లాడారు.
నిరుద్యోగుల కోసం కేటీఆర్, హరీశ్‌రావును దీక్ష చేయమని రేవంత్ అంటున్నరు. వాళ్లు ఆమరణ దీక్ష చేస్తూ సచ్చిపోతే పీడ పోతది అంటున్నారు. ఇవేనా సీఎం స్థాయిలో ఉండి మాట్లాడే మాటలు. మేం తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు, దీక్షలు చేశాం. వందల కేసులు మాపై పెట్టారు.. జైళ్లకు పోయాం. అప్పుడు ఎక్కడున్నావ్ రేవంత్..? చంద్రబాబు సంక నాకుతున్నవ్. తుపాకీ పట్టుకుని తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలని తిరిగావు. ఉద్యమ నేపథ్యం లేదు. ఉద్యమం గురించి తెల్వదు. కానీ ఉద్యమ నాయకులను, నిరుద్యోగులను అవమానిస్తావు అంటూ నిప్పులు చెరిగారు గాదరి కిశోర్.
రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ.. నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆయన నీట్ రద్దు గురించి మాట్లాడినందుకు రాహుల్‌ను కూడా ఆమరణ దీక్ష చేయమని చెబుతున్నావా..? ఆయనను కూడా చచ్చిపోవాలని అంటున్నావా..? ఓ చీడ పురుగును నెత్తిన ఎత్తుకున్నాం అని రేవంత్ రెడ్డే దీక్ష చేసి చచ్చిపోతే బాగుంటదని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అంటే బాగుంటదా..? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు.
నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఏం పనులు చేయాలి. ప్రజలు, నిరుద్యోగుల డిమాండ్లు నిజాయితీగా ఉన్నాయా..? లేదా అనేది ఆలోచించాలి. రేవంత్ శాడిస్టులాగా ప్రవర్తిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ప్రజా గొంతుకలు మూగబోయాయి. కోదండరాం ఎక్కడ పోయిండు. ఎక్కడ పోయింది మీ గొంతు. ప్రస్తుతం ఓయూలో 300 మంది పోలీసులు ఉన్నారు. బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేశారు. ప్రజా సంఘాలలో పని చేసే వారు కూడా మద్దతు ఇవ్వడం లేదు. నిరుద్యోగులది సహేతుకమైన సమస్య. మెగా డీఎస్సీ వేస్తా అని చెప్పినవ్.. వేయాలని అడుగుతున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామనడానికి సిగ్గు ఉండాలి. ఇది సిగ్గుమాలిన చర్య. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అంటూ గాదరి కిశోర్ మండిపడ్డారు.