జహీరాబాద్, నవంబర్ 23: మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తమ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, ఆ రాష్ట్ర నాయకుడు సచిన్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ఎంతో అభివృద్ధి చేసిందని కొనియాడారు. మహారాష్ట్రలో ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందినట్టు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుపొంది మూడోసారి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.