హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ సెక్రటరీకి లేఖలు రాశారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల్లో అయోమయం కలిగించేందుకు బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
టెన్త్ పేపర్ లీకేజీకి పాల్పడిన బూరం ప్రశాంత్‌తో బండి సంజయ్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న 4.8 లక్షల మంది విద్యార్థులను, తల్లిదండ్రులను బండి అయోమయానికి గురి చేశారని తెలిపారు.