హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం తమిళనాడులో పర్యటించింది. బాల సుమన్ నేతృత్వంలోని బృందం చెన్నైలోని డీఎంకే ప్రధాన పార్టీ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే శేఖర్‌తో భేటీ అయ్యారు.
డీఎంకే పార్టీ నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ విధివిధానాలు, ప్రస్తుత రాజకీయాల్లో ఆ పార్టీ ఎంచుకున్న మార్గాలు, సిద్ధాంతలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు రోజులపాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో డీఎంకే పార్టీ కార్యాలయాలను సందర్శించనున్నారు. బీఆర్ఎస్ బృందంలో ఆంజనేయగౌడ్, తుంగ బాలు, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.