సీపీకే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతేమిటి?
రాష్ట్ర రాజధానిలో పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేమిటని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
- హైదరాబాద్‌లో కుప్పకూలిన శాంతిభద్రతలు
- మహిళలపై నేరాలు నిరుడి కంటే 6% పెరుగుదల
- కమాండ్ కంట్రోల్‌ను రాజకీయ అడ్డాగా మార్చేశారు: దాసోజు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేమిటని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. దిల్సుఖ్నగర్ వంటి రద్దీ ప్రాంతంలో పోలీస్ కమిషనర్‌నే చుట్టుముట్టి వేధించారంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఇది పోలీస్ వైఫల్యం మాత్రమే కాదని, నేరగాళ్లలో చట్టం పట్ల భయం పూర్తిగా నశించిందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున 40 మంది పోకిరీల నుంచి ఐపీఎస్ అధికారిణికే వేధింపులు ఎదురయ్యాయంటే, మహిళల భద్రతను ఎంతలా గాలికి వదిలేశారో అర్థమవుతున్నది ఆవేదన వ్యక్తంచేశారు. మలాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌లో వెలుగుచూసిన భయంకర నిజాలపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సుమతికి ఎదురైన అనుభవం ఒక ప్రమాదకరమైన ధోరణికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇటీవలి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వార్షిక క్రైమ్ రిపోర్టుల ప్రకారం హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు గత ఏడాది కంటే 6% పెరిగాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వేధింపు కేసులు 9% పెరిగాయని గుర్తుచేశారు. దక్షిణ భారతదేశంలోనే మహిళలపై అఘాయిత్యాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం గమనార్హమని మండిపడ్డారు. హోంశాఖ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఒక రాజకీయ అడ్డాగా మార్చేశారని విమర్శించారు. ‘సీఎం సచివాలయం కంటే ఎకువగా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే కనిపిస్తున్నారు. కానీ అకడ ఆయన ఏం చేస్తున్నారు? వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వ్యవస్థను ప్రజల రక్షణ కోసం వాడుతున్నారా? లేక ప్రతిపక్ష నాయకుల కదలికలను ట్రాక్ చేయడానికి, రాజకీయ వ్యూహాల కోసం వాడుతున్నారా?’ అని నిలదీశారు. దేశంలోనే అత్యంత అధునాతన నిఘా వ్యవస్థ ఉండి కూడా, నడిరోడ్డుపై ఒక మహిళను 40 మంది చుట్టుముట్టిన విషయాన్ని గుర్తించలేకపోయిందంటే.. అకడ ‘కమాండ్’ ఫెయిల్ అయ్యింది, ‘కంట్రోల్’ అస్సలు లేదు. కేవలం రాజకీయ గూఢచారి కోసం టెక్నాలజీని వాడుకుంటూ, సామాన్యులను నేరగాళ్ల పాలు చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

