హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లపై హనుమంతరావు, రోహిత్రావుతోపాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు తప్పుడు పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని, బ్యానర్లు కడుతున్నారని విన్నవించారు.