నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 8 : వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్.. ఏడో రోజైన మం గళవారం కూడా నిరసనలు చేపట్టింది. జి ల్లాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపారు. మహబూబ్ నగర్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, హనుమకొండలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కొత్తగూడెంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.
ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకొన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హౌస్ అరెస్టులో ఉద్రికత్త నెలకొన్నది. వర్ధన్నపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వెళ్తుండగా రమేశ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పించుకొని వెళ్లేందుకు య త్నించగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలోఆయ న ఎడమ చేతి వేలికి, జడ్పీ మాజీ వైస్ చైర్మ న్ గజ్జెల్లి శ్రీరాములు కాలికి గాయమైంది.