వనపర్తి : వనపర్తి జిల్లా(Vanaparthy) పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) సమక్షంలో గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు (Congress leaders) శ్రవణ్ కుమార్, సురేశ్, ముజీబ్, మంజూర్, అంజి, శ్రీను, రమేశ్, మహమూద్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
అదేవిధంగా రేవల్లి మండలం తల్పూనూరు గ్రామానికి చెందిన 18 మంది యువకులు వివిధ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరారు. వీరికి వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి గులాబీకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై సీఎం కేసీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతి రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేశ్, నర్సింహ, కృష్ణయ్య, మాడ్గుల శేఖర్ రెడ్డి, యానమోని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.