హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిపిన లాఠీచార్జిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెంట్రల్ యూనివర్సిటీల భూములను కూడా వదిలి పెట్టడం లేదని, దేశంలో నంబర్‌వన్ 420 రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు.
గతంలో ఇదే హెచ్‌సీయూను రాజకీయంగా వాడుకొని అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్.. నేడు వర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జితో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎకడికిపోయారని ప్రశ్నించారు.