KCR |హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలక్కతుర్తి సభకు ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరారు. తన మిత్రుడు జహంగీర్ కేసీఆర్కు దట్టి కట్టారు. అనంతరం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఎల్కతుర్తికి కేసీఆర్ బయల్దేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ కుమార్ ఉన్నారు. మరికాసేపట్లో కేసీఆర్ ఎల్కతుర్తిలో ప్రసంగించనున్నారు.