KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు, సీతాదేవి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని, శాంతి, సంతోషాలు, సామరస్యాలు, సౌభాగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీరాముడి త్యాగాలను కొనియాడారు. శ్రీరాముడు ఎంతో పవిత్రమైన జీవితాన్ని గడిపారని, భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచారని తెలిపారు. వైవాహిక విలువలను నిలబెట్టడంలో, సమాజ శ్రేయస్సు కోసం త్యాగం చేయడంలో ఈ జంటను ఆదర్శప్రాయమన్నారు.